కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ హీరోగా, మాస్ రాజా రవితేజ నిర్మిస్తున్న చిత్రం "మట్టి కుస్తీ". చెల్లా అయ్యావు డైరెక్షన్లో కంప్లీట్ స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించారు.
ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రవితేజ నిన్న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా మట్టి కుస్తీ సెకండ్ లుక్ ను కాజల్ అగర్వాల్ రిలీజ్ చేసారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో విష్ణు విశాల్ మట్టి కుస్తీ పోటీకి దిగబోతున్నట్టుగా ఉంటే, తాజాగా రిలీజ్ ఐన సెకండ్ లుక్ లో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మితో విష్ణు చేతి పట్టు పోటీ పడుతున్నట్టు కనిపిస్తారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కావడానికి రెడీ అవుతుంది.