ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెన్నులో వణుకు పుట్టిస్తున్న ... అడివిశేష్ హిట్ 2 టీజర్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 03, 2022, 12:02 PM

కొంచెంసేపటి క్రితమే అడివిశేష్ హీరోగా నటిస్తున్న హిట్ 2 టీజర్ విడుదలైంది. ఆహ్లాదకర పోలీస్ నేపథ్యంతో మొదలైన ఈ టీజర్ మధ్యలో యూ టర్న్ తీసుకుని ఘోరంగా జరిగిన మిస్టరీ మర్డర్ కేసు వద్ద వెళ్లి ఆగుతుంది. ఈ సీన్ స్క్రీన్ ప్రెజెంటేషన్ చూసే ప్రేక్షకులకు ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది. దీంతో హిట్ 2 పై భారీ అంచనాలు నమోదయ్యాయి.


అడివిశేష్, మీనాక్షి చౌదరి, రావు రమేష్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, కోమలి ప్రసాద్, శ్రీనాధ్ మాగంటి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.


వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని ఈ సినిమాను సమర్పిస్తుండగా, ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. పోతే, డిసెంబర్ 2వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com