2019లో విడుదలై, ఘనవిజయం సాధించిన 'బెల్ బాటమ్' డైరెక్టర్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "బనారస్". కర్ణాటక సీనియర్ పొలిటీషియన్ జమీద్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్ ఈ సినిమాతో తెరంగేట్రం చేస్తున్నారు.
ఒక అందమైన రొమాంటిక్ లవ్ స్టోరీకి, టైం ట్రావెల్, టైం లూప్, పునర్జన్మ అంశాలను జోడించి, ఎంతో వైవిధ్యంగా డైరెక్టర్ జయతీర్ధ ఈ సినిమాను రూపొందించారు. బనారస్ ట్రైలర్ తోనే సినిమాలో ఏదో ఫ్రెష్ ఎలిమెంట్ ఉందని అర్ధమైంది. దీంతో అన్ని భాషల ప్రేక్షకులు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
నేషనల్ ఖాన్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తిలక్ రాజ్ బల్లాల్ నిర్మించిన ఈ సినిమాను నాంది సతీష్ వర్మ ఇరు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. పోతే, రేపే ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa