వీడియో గేమ్... ఈ మాట వింటే కుర్రాళ్లు ఎగిరి గంతేస్తారు. టైంపాస్ కోసం గేమ్స్ ఆడేవాళ్లు కొందరైతే, గంటలు గంటలు గేమ్స్ ఆడేవాళ్లూ ఉంటారు. అందుకే యాప్ స్టోర్స్‌లో గేమ్స్‌కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. గూగుల్‌లో లక్షలాది గేమింగ్ యాప్స్ ఉంటాయి. రోజూ కొన్ని వందలు కొత్త యాప్స్ వచ్చి చేరుతుంటాయి. మరి 2018లో సూపర్ హిట్టైన గేమ్ యాప్స్ ఏవో తెలుసుకోండి.
1. పబ్‌జీ మొబైల్: PUBG... ప్లేయర్ అన్‌నోన్స్ బ్యాటిల్‌గ్రౌండ్స్. గేమింగ్ వాల్డ్‌లో ఓ సెన్సేషన్. 20 కోట్ల యూజర్లతో టాప్‌లో ఉంది. అందులో 3 కోట్ల మంది యూజర్లు రోజూ యాక్టీవ్‌గా ఉంటారని అంచనా. ఇటీవల గూగుల్ ప్లే ర్యాంకింగ్స్‌లో పబ్‌జీ బెస్ట్ గేమ్ ఆఫ్ ది ఇయర్‌గా టాప్‌లో నిలిచింది. ఇది మిలిటరీ స్టైల్ షూటర్ బ్యాటిల్ రాయల్ గేమ్. ఇందులో 100 మంది ప్లేయర్స్‌ని యుద్ధక్షేత్రంలో వదిలేస్తారు. అందులో అందరూ అందరితో యుద్ధం చేస్తుంటారు. చివరకు ఎవరు మిగుల్తారో వాళ్లే విజేత.
2. ఫోర్ట్‌నైట్: ఇది కూడా వార్ గేమ్. ఎపిక్ గేమ్స్ సంస్థ తయారు చేసిన గేమ్ 'సేవ్ ద వాల్డ్', 'బ్యాటిల్ రాయల్' పేరుతో రెండు వర్షన్లు ఉన్నాయి. ఈ గేమ్ ప్లేస్టోర్‌లో లభించకపోయినా నేరుగా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గేమింగ్ లవర్స్‌కు ఈ గేమ్ అంటే పిచ్చి. ప్రస్తుతం రెండు వర్షన్లలో ఉంది ఈ గేమ్. అందులో ఒకటి 'సేవ్ ద వాల్డ్'. నలుగురు ప్లేయర్లు ఒకరికొకరు సహకరించుకుంటూ ఓ లక్ష్యాన్ని ఛేదించడమే ఈ గేమ్ ప్రత్యేకత. ఇక 'బ్యాటిల్ రాయల్' రెండో వర్షన్. ఇది ప్లేయర్ వర్సెస్ ప్లేయర్ గేమ్. వందమంది ప్లేయర్లు ఒకేసారి ఆడొచ్చు. లేదా ఇద్దరు, నలుగురు స్క్వాడ్స్ ఈ గేమ్ ఆడొచ్చు. తమను తాము రక్షించుకుంటూ ప్రత్యర్థులను హతమారుస్తూ ముందుకెళ్లడమే ఈ గేమ్.
3. ఆస్ఫాల్ట్ 9 లెజెండ్స్: ఇది కార్ రేసింగ్ గేమ్. రేసులంటే మోజు ఉన్నవారికి ఈ గేమ్ మంచి మజా ఇస్తుంది. ప్రపంచ ప్రసిద్ధి కార్లైన లంబోర్ఘిని, ఫెరారీ, పోర్షే లాంటి 50 కార్లు ఇందులో ఉంటాయి. వాటిలో రేసులో దూసుకెళ్లొచ్చు. గ్రాఫిక్స్ కూడా అదిరిపోతాయి.
4. హీలిక్స్ జంప్: ఇది అడ్వెంచర్ గేమ్. గూగుల్ ప్లే స్టోర్‌లో గేమింగ్ యాప్స్ 100 కోట్ల డౌన్‌లోడ్స్ మార్క్ దాటడం చాలా కష్టం. కానీ హీలిక్స్ జంప్ ఆ మార్క్‌ను దాటేసింది.
5. హ్యాపీ గ్లాస్: ఖాళీ ఉన్న గ్లాసును ఫిల్ చేయడమే గేమ్. లైన్స్ డ్రా చేస్తూ లిక్విడ్‌ను గ్లాసులో పడేలా చేయడం పెద్ద పజిల్. సింపుల్‌గా అనిపించినా ఆడటం చాలా కష్టం.
6. షాడో గన్ లెజెండ్స్: బ్యాటిల్ రాయల్ ఫార్మాట్ నచ్చనివాళ్లు ఈ గేమ్ ట్రైచేయొచ్చు. మంచి థ్రిల్లింగ్ గేమ్. రియల్ టైమ్ టీమ్ వర్సెస్ టీమ్ బ్యాటిల్ మోడ్‌లో ఆడొచ్చు.
7. హెచ్‌క్యూ ట్రివియా: ఇది లైవ్ ట్రివియా యాప్. రియల్ మనీ కోసం గేమ్ ఆడొచ్చు. ఈ గేమ్‌లో 12 మల్టిపుల్ ఛాయిస్ ట్రివియా ప్రశ్నలు ఉంటాయి. ఈజీ నుంచి హార్డ్ వరకు సెట్ చేసుకోవచ్చు. ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాల నుంచి గేమ్‌లో పార్టిసిపేట్ చేస్తారు. రియల్ టైమ్‌లో ఆన్సర్స్ చెప్పాల్సి ఉంటుంది. జవాబు చెప్పడానికి 10 సెకన్ల టైమ్ మాత్రమే ఉంటుంది. గేమ్ బాగా ఆడితే డాలర్లు గెలుచుకోవచ్చు. 12 ప్రశ్నలకు ఎవరు సమాధానాలు చెబితే వారికి ప్రైజ్ మనీ పంచుతారు.
8. లూడో కింగ్: ఈ గేమ్ని ఒక్కరే ఆడొచ్చు. లేదా గ్రూప్‌తో కలిసి ఆడొచ్చు. ఒకరు గెలిచినా మిగిలినవాళ్లు గేమ్ కొనసాగించొచ్చు.
9. క్యాండీ క్రష్ సాగా: పాపులర్ మొబైల్, పీసీ పజిల్ గేమ్ అయిన క్యాండీ క్రష్ గురించి పరిచయం అక్కర్లేదు. ఈ పజిల్ గేమ్ ఇప్పటికీ గేమింగ్ లవర్స్‌ని ఆకట్టుకుంటోంది.
10 రియల్ రేసింగ్ 3: ఇది కూడా రేసింగ్ గేమే. ప్రపంచవ్యాప్తంగా ఉండే రియల్ ట్రాక్స్‌ని ఎంచుకొని గేమ్ ఎంచుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa