మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాల షూటింగులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య లొకేషన్ లో భోళాశంకర్ డైరెక్టర్ మెహర్ రమేష్ గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి గారు దగ్గరుండి మెహర్ రమేష్ బర్త్ డే ను సెలెబ్రేట్ చెయ్యడంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
విశేషమేంటంటే కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పుట్టినరోజు కూడా ఇదే రోజు కావడంతో ఇద్దరూ వాల్తేరు వీరయ్య సెట్స్ లోనే తమ తమ పుట్టినరోజులను జరుపుకోవడం జరిగింది. మెగాస్టార్ దగ్గరుండి ఇద్దరి చేత కేక్ కట్ చేయించారు. ఈ వేడుకలకు సంబంధించిన పిక్స్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ పిక్స్ లో వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ, సప్తగిరి, షకలక శంకర్, గెటప్ శీను శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.