సాయి రోనక్, అంకితా సాహా జంటగా నటించిన చిత్రం "రాజయోగం". రామ్ గణపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అరుణ్ మురళీధరన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేసేందుకు యంగ్ సక్సెస్ఫుల్ హీరో విశ్వక్ సేన్ రెడీ అయ్యారు. ఈ రోజు సాయంత్రం ఏడున్నరకు హైదరాబాద్ AMB సినిమాస్ స్క్రీన్ 6లో జరిగే టీజర్ లాంచ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ పాల్గొని, రాజయోగం టీజర్ ను విడుదల చెయ్యబోతున్నారు.
శ్రీ నవబాలా క్రియేషన్స్ , వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై మని లక్ష్మణ్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.