బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో బాడీ బ్యాలెన్స్ తప్పిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన సినిమా షూటింగ్‌లను ఆపేశారు. చాలా కష్టపడుతున్నట్లు చెప్పారు. ఈ వ్యాధి జన్యుపరమైన, వైరల్, ట్రామటిక్ కారణాలతో సంభవించవచ్చు. ఇది ప్రత్యక్ష, పరోక్ష మార్గాలలో రోజువారీ జీవితాన్ని, పనితీరును ప్రభావితం చేస్తుంది.