అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలై, తొలి షో నుండే పాజిటివ్ టాక్ అందుకుని, బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లను రాబడుతుంది.
చాన్నాళ్ల తరవాత గ్రాండ్ సక్సెస్ అందుతున్న తమ్ముడు శిరీష్ ఊర్వశివో రాక్షసివో సక్సెస్ సెలబ్రేషన్ కోసం అన్నయ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ రోజు సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్ JRC కన్వెన్షన్స్ లో ఊర్వశివో రాక్షసివో యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి.
రాకేష్ శశి డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని, విజయ్ నిర్మించారు. అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.