ప్రతినిధి, నెపోలియన్ వంటి ఇంటరెస్టింగ్ సినిమాలకు రచయితగా పనిచేసిన ఆనంద్ రవి కథ , స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన కొత్త చిత్రం "కొరమీను". శ్రీపతి కర్రీ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆనంద్ రవి, కిషోరీ ధాత్రక్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో హరీష్ ఉత్తమన్, శత్రు, రాజా రవీంద్ర, జబర్దస్త్ ఇమ్మానుయేల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
లేటెస్ట్ గా కొరమీను టీజర్ రిలీజ్ అయ్యింది. కొత్తగా జాయినైన పోలీసాఫీసర్ మీసాలరాజుగారి మీసాలను సముద్రం ఒడ్డున గుర్తు తెలియని వ్యక్తులు తీసెయ్యడంతో మొదలైన మీసాలరాజుగారి రివెంజ్ ఆపై ఎన్ని మలుపులను తీసుకుంది? అసలు ఈ పని ఎవరు చేసారు? ఎందుకు చేసారు? మీసాల రాజు తన రివెంజ్ తీర్చుకున్నాడా? అనే విషయాలతో పక్కా రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని కలుగజేస్తుంది.