మలయాళ, తమిళ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరును సంపాదించింది అనిఖా సురేంద్రన్. ఇప్పుడామె తెలుగు సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా లాంచ్ కాబోతుంది.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త బ్యానర్లు నిర్మిస్తున్న 'బుట్టబొమ్మ' చిత్రంలో అనిఖా లీడ్ హీరోయిన్ గా నటిస్తుంది. అర్జున్ దాస్, సూర్య వసిష్ఠ హీరోలుగా నటిస్తున్నారు. 2020లో మలయాళంలో విడుదలైన సూపర్ హిట్ మూవీ 'కప్పెల'కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకు శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి రేపు ఉదయం 11:08 నిమిషాలకు టీజర్ విడుదల కాబోతుంది.