టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. సోమవారం అనుష్క బర్త్ డే సందర్భంగా యూవీ క్రియేషన్స్ నవీన్ పొలిశెట్టి, అనుష్క కాంబినేషన్ లో వస్తున్న సినిమా అప్ డేట్ ను ప్రకటించింది. ఈ సినిమాలో అన్విత రవళి శెట్టి అనే పాత్రలో అనుష్క కనిపించనుంది. చెఫ్ గెటప్ లో ఉన్న అనుష్క పోస్టర్ ను యూవీ క్రియేషన్స్ సంస్థ విడుదల చేసింది. ఈ సినిమాకు పి.మహేష్ బాబు దర్శకుడు.