మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ ఈరోజు 52వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే కదా. ఈ మేరకు ఉదయం నుండి సెలబ్రిటీలు, నెటిజన్లు సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొంచెంసేపటి క్రితమే సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్టైల్ లో గురూజీకి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తూ ట్వీట్ చేసారు. 'త్రివిక్రం శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు .. ఈ సంవత్సరమంతా మీకు చాలా బాగుండాలి' అంటూ మహేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం మీడియాలో హల్చల్ చేస్తుంది.
త్రివిక్రమ్ - మహేష్ బాబు కలయికలో ప్రస్తుతం ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని సినిమా షూటింగ్ జరుగుతుంది. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు అతడు, ఖలేజా ప్రేక్షకుల హృదయాలను దోచుకోవడంతో రాబోతున్న సినిమాపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.