నటసింహం నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఒక సినిమాకు కమిటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య వీరసింహారెడ్డి షూటింగ్ లో బిజీగా ఉండడంతో, అనిల్ సినిమా వచ్చే జనవారికి షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది.
బాలయ్య కెరీర్ లో 108వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్యకు కూతురిగా నటిస్తుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది.
విషయమేంటంటే, ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా బాలీవుడ్ బొద్దు గుమ్మ సోనాక్షి సిన్హా ను మేకర్స్ అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి. ఒకవేళ ఈ కాంబో ఫిక్స్ ఐతే, ఈ సినిమాతోనే సోనాక్షి టాలీవుడ్ ప్రేక్షకులకు హలో చెప్పనుంది.