అక్కినేని నాగచైతన్య రీసెంట్ ఫిలిం "థాంక్యూ" ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే కదా. దీంతో ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాక ఓటిటిలోనూ నాగచైతన్య థాంక్యూ ని రిసీవ్ చేసుకునేందుకు ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించలేదు.
లేటెస్ట్ గా ఈ సినిమా బుల్లితెర పై సందడి చెయ్యడానికి రెడీ అయ్యింది. నవంబర్ 13 సాయంత్రం ఆరింటికి జెమిని ఛానెల్ లో థాంక్యూ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధంగా ఉంది.
విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ లైఫ్ జర్నీ గా రూపొందిన ఈ సినిమాలో రాశిఖన్నా, అవికాగోర్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు నిర్మించారు.