పాన్ ఇండియా సూపర్ హిట్ మూవీ RRR అక్టోబర్ 21వ తేదీన జపాన్ లో విడుదలైంది. ఈ మేరకు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ సతీసమేతంగా జపాన్ వెళ్లి ముమ్మర ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.
విడుదలైన మూడో వారానికి అంటే 17 రోజులకు RRR సినిమా జపాన్ లో విడుదలైన ఇండియన్ సినిమాలలో 185 మిలియన్ యెన్ల కలెక్షన్లతోటి థర్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అంతేకాక ఈ మార్కు అందుకున్న ఫాస్టెస్ట్ ఇండియన్ డబ్బింగ్ మూవీగా RRR సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది. దీంతో జపాన్లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన ముత్తు, బాహుబలి తదుపరి స్థానంలో RRR నిలిచింది. మరి, లాంగ్ రన్ లో ఈ సినిమా కలెక్షన్లు ఎక్కడికి వెళ్లి ఆగుతాయో..!!