‘బింబిసార’ సినిమా సూపర్ హిట్ తర్వాత, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా ‘అమిగోస్’. ఈ సినిమాకి నూతన దర్శకుడు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించారు చిత్రబృందం. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.