పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడుగా నటించిన సినిమా 'ఆదిపురుష్'. ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటించింది. ఈ సినిమాకి ఓం రావత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఈ సినిమా వాయిదా వేస్తున్నటు చిత్ర బృందం తెలిపింది. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీ ప్రకటించారు. ఈ సినిమా 2023 జూన్ 16 రిలీజ్ కానుంది ప్రకటించారు.