కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ కొత్త సినిమా వారిసు నుండి నవంబర్ 5వ తేది సాయంత్రం రంజితమే అనే కలర్ఫుల్ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజైన విషయం తెలిసిందే కదా. 24 గంటల్లో 18 మిలియన్ రియల్ టైం వ్యూస్ ను రాబట్టిన ఈ డాన్స్ నెంబర్ ప్రస్తుతం 26మిలియన్ వ్యూస్ తోటి యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ #1 గా దూసుకుపోతుంది. తలపతి విజయ్ స్వయంగా తన గొంతుతో ఈ పాటను పాడారు.
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది. జయసుధ, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, ప్రభు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.
![]() |
![]() |