హృతిక్ రోషన్ సోదరి పష్మినా రోషన్‌తో బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ ముద్దుల తనయ సారా అలీ ఖాన్‌తో ప్రేమలో పడి వీడిపోయిన ఈ స్టార్.. తాజాగా హృతిక్ సోదరితో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ ముంబయి రోడ్లపై చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సారా అలీ ఖాన్ తర్వాత కృతిసనన్‌తో కూడా ఈ హీరో సన్నిహితంగా ఉన్నట్లు గతంలో రూమర్లు వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa