కమర్షియల్ మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో 'జనతా గ్యారేజ్' సినిమాను చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. తాజాగా ఇదే కాంబోలో మరొక ఎక్జయిటింగ్ మూవీ రాబోతుందన్న విషయం తెలిసిందే కదా.
తారక్ కెరీర్ లో 30వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు నడుస్తున్నాయి. మేకర్స్ మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు ఈ వార్తలను వేటినీ పట్టించుకోకుండా తమ పనిని తాము హాయిగా చేసుకుంటున్నారు. అదేనండి.. NTR 30 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సూపర్ బిజీగా ఉన్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాను వచ్చే ఏడాది దసరా కానుకగా విడుదల చెయ్యాలని, అందుకు తగ్గట్టు షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.