బాలీవుడ్ భామలు రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా మధ్య వివాదం ముదురుతోంది. ఇటీవల విలేకరుల సమావేశంలో తనకు సంబంధించిన అభ్యంతరకర వీడియోను చూపించారని షెర్లిన్ చోప్రా ఆరోపించింది. దీనిపై ముంబై పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో రాఖీ సావంత్, ఆమె అడ్వొకేట్ ఫల్గుణి బ్రహ్మభట్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో 354A, 500, 504, 509, ఐటీ చట్టాల ప్రకారం వారిపై కేసు నమోదైనట్లు షెర్లిన్ వెల్లడించింది.