వెంకటేష్ మరియు విశ్వక్ సేన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా ఫాంటసీ లవ్ డ్రామా ‘ఓరి దేవుడా’. ఈ సినిమాలో వెంకటేష్ మోడ్రన్ గాడ్ గా నటించగా, విశ్వక్ అతడి భక్తుడిగా నటించాడు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న విడుదలైన ఈ సినిమా ఆశించిన రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. ఇదిలావుంటే, ఈ సినిమా OTTకి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. ‘ఓరి దేవుడా’ నవంబర్ 11 నుండి ప్రసిద్ధ OTT యాప్ ఆహాలో అందుబాటులో ఉంటుంది. అంటే నవంబర్ 10 అర్ధరాత్రి నుండి ఇది ప్రసారం అవుతుంది.
![]() |
![]() |