సమంత నటించిన యశోద సినిమా నవంబర్ 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఉదయ్ శంకర్ నటించిన 'నచ్చింది గళ్ ఫ్రెండూ' సినిమా కూడా ఈ నెల 11న విడుదల కానుంది. శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నటించిన 'మది' సినిమా, అమితాబ్ బచ్చన్ నటించిన 'ఊంచాయి' కూడా నవంబర్ 11న థియేటర్లలో విడుదల కానున్నాయి. రోషాక్ (తెలుగు), ఇరావిన్ నిగళ్ (తమిళ సినిమా) లాంటి కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో రానున్నాయి.