అతిలోక సుందరి శ్రీదేవి కూతురు అందాల షోనే టార్గెట్‌గా పెట్టుకున్నట్టుంది. చూడబోతుంటే ఆమె గ్లామర్ షో చేయడానికే సందర్భాలను వెతుకున్నట్టుగా ఉంది. వరుసగా హాట్ ఫోటోలతో రచ్చలేపుతుంది. జాన్వీ కపూర్ గ్లామర్ షో చేసే అది నెక్ట్స్ లెవల్ లో ఉంటుంది. మొన్నటి వరకు `మిలి` సినిమా కోసం హాట్‌ట్రీట్ ఇచ్చిన ఈ బ్యూటీ, ఆ అందాల దాడితో తేరుకోకముందే ఇప్పుడు ఉప్పెనలా వచ్చిపడుతుంది. వెకేషన్ ఫోటోలతో దుమారం రేపుతుంది. ప్రస్తుతం నెట్టింట రచ్చ లేపుతుంది.
తాజాగా సౌదీ అరేబియాలో వెకేషన్‌కి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది జాన్వీ కపూర్. గతేడాది డిసెంబర్‌లో సౌదీ అరేబియా వెళ్లింది జాన్వీ. అక్కడ నాన్ స్టాప్ గాఎంజాయ్ చేసింది. అక్కడి ఏడారులను, నగరాల అందాలను ఆస్వాదించింది. బౌండరీలు బ్రేక్ చేసి మరీ ఎంజాయ్ చేసింది. విహారయాత్రకి ఓ మెమరీగా మార్చుకుంది.