కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్లో అక్కినేని నాగచైతన్య హీరోగా, కృతి శెట్టి హీరోయిన్గా ఒక ద్విభాషా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఇందుకోసం ఒక భారీ సెట్ ను మేకర్స్ రూపొందించారు. చైతు, అరవింద్ స్వామి, శరత్ కుమార్ ...ముగ్గురిపై భీకర పోరాట సన్నివేశాలను ప్రస్తుత షెడ్యూల్ లో డైరెక్టర్ వెంకట్ ప్రభు చిత్రీకరిస్తున్నారట.
ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, ప్రేమ్ జి అమరేన్, ప్రేమి విశ్వనాధ్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఒకేసారి తెలుగు, తమిళంలో షూటింగ్ జరుపుకుంటుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిమిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |