చిత్ర పరిశ్రమలో సింగర్ సునీతది ఒక ప్రత్యేక స్థానం. సింగర్ గానే కాక డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఆమె ఎంతో బిజీగా ఉన్నారు. తమ కొడుకు ఆకాష్ ను సునీత హీరోగా పరిచయం చేస్తున్నారంటూ చాలాకాలంగా వినిపిస్తోంది. దీనిపై ఆమె క్లారిటీ ఇస్తూ, ఆకాష్ ను హీరోగా పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు. తన కొడుకు సిల్వర్ స్క్రీన్ మీదకు వెళ్తున్నాడని, అందరూ ఆశీర్వదించాలని ఆమె కోరారు.