సినీ పరిశ్రమలో గాయని సునీతది ప్రత్యేక స్థానం. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా బిజీ బిజీగా ఉంది. సునీత తన కొడుకు ఆకాష్‌ని హీరోగా పరిచయం చేస్తోందని చాలా కాలంగా వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ ఇచ్చిన ఆమె.. ఆకాష్‌ని హీరోగా పరిచయం చేయనున్నట్టు ప్రకటించింది. వెండితెరపైకి రాబోతున్న తన కొడుకును అందరూ ఆశీర్వదించాలని కోరింది.