ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా, వెంకీ అట్లూరి డైరెక్షన్లో రూపొందుతున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం "సార్ / వాతి". ఈ సినిమా నుండి నిన్నే ఫస్ట్ లిరికల్ సాంగ్ మాస్టారూ మాస్టారూ... విడుదలైంది. జీవీ ప్రకాష్ కుమార్ స్వరకల్పనలో శ్వేతామోహన్ పాడిన ఈ అద్భుతమైన మెలోడీ గీతానికి సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యం అందించారు. తమిళంలో ఈ పాటకు ధనుష్ లిరిక్స్ రాయడం విశేషం.
సాయికుమార్, తనికెళ్ళ భరణి, సముద్రఖని, హైపర్ ఆది, ఆడుకులం నరేన్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. డిసెంబర్ 2వ తేదీన తెలుగు, తమిళ భాషలలో ఈ చిత్రం విడుదల కావడానికి రెడీ అవుతుంది.