ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాని చెల్లెలు డైరక్ట్ చేసిన "మీట్ క్యూట్"... రేపు టీజర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 11, 2022, 12:12 PM

నాచురల్ స్టార్ నాని చెల్లెలు దీప్తి డైరెక్టర్ గా పరిచయమవుతున్న చిత్రం "మీట్ క్యూట్". ప్రముఖ ఓటిటి సోనీ లివ్ ఒరిజినల్స్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తుండగా, నాని సమర్పిస్తున్నారు.


లేటెస్ట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. అంథాలజీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఐదు కధలుగా ఉండబోతుంది. వర్ష బొల్లమ్మ, రుహానీ శర్మ, ఆకాంక్ష సింగ్, అశ్విన్ కుమార్ లక్ష్మీకాంత్, అదాశర్మ, సంచితా పూనాచా, సీనియర్ నటి రోహిణి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ టీజర్ రేపు రిలీజ్ కాబోతుంది. విజయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు గారి ఎడిటర్ గా పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సోనీ లివ్ ఓటిటిలో స్ట్రీమింగ్ కు రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa