తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఓటిటి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న బింబిసార తాజాగా హిందీ ఓటిటి ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమైంది. ఈ రోజు నుండి జీ 5 ఇండియాలో బింబిసార హిందీ వెర్షన్ అందుబాటులోకొచ్చింది. మొత్తంగా పాన్ ఇండియా భాషల్లో బింబిసార జీ 5 ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది.
వసిష్ఠ డైరెక్టర్ గా పరిచయమైన ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ టైట్యులర్ రోల్ లో నటించారు. క్యాథెరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష కీలకపాత్రలు పోషించారు. ఎం ఎం కీరవాణి, చిరంతన్ భట్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa