కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన కొత్త చిత్రం "లాఠీ". ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈపాటికి విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల నిమిత్తం ఇంకా విడుదల కాలేదు. ఏ. వినోద్ కుమార్ డైరెక్షన్లో ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో విశాల్ పవర్ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నారు. రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ నందా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సునయన నటిస్తుంది. సామ్ సిఎస్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్, ఫస్ట్ లిరికల్ సాంగ్, స్పెషల్ గ్లిమ్స్ వీడియోలు ఒకేసారి విడుదల కాబోతున్నట్టు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ మేరకు నవంబర్ 13న హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్స్ హాల్ లో లాఠీ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరగబోతుంది. పోతే, ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa