ఈతరం హీరోయిన్స్ లో స్క్రిప్ట్ విషయంలో సెలెక్టెడ్ గా ఉండే అతికొద్ది మంది హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హైదరాబాదీ త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది.
లేటెస్ట్ గా ఆమె హీరోయిన్ గా నటించిన 'కలగ తలైవన్' ట్రైలర్ విడుదలై, అద్భుతమైన రివ్యూస్ అందుకుంటుంది. ఈ సినిమాలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించారు. నవంబర్ 18న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ మేరకు కలగ తలైవన్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నిధి మెరూన్ కలర్ సారీ పిక్స్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెరూన్ కలర్ శారీలో కెమెరాకు నిధి ఇచ్చిన ఫోజులు సింపుల్ అండ్ స్టైలిష్ గా ఉన్నాయి.