పాజిటివ్ మౌత్ టాక్ వల్ల టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కన్నడ డబ్బింగ్ మూవీ కాంతార కలెక్షన్ల పరుగు ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించట్లేదు. కొత్తగా రిలీజవుతున్న నేటివ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి ఒక కన్నడ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ ను ఏలడం నిజంగా విశేషమే.
ఇరు తెలుగు రాష్ట్రాలలో లేటెస్ట్ గా కాంతార పాతిక కోట్ల షేర్ మార్క్ ను అందుకుని ఔరా అనిపిస్తుంది. అతి తక్కువ ధరకి కాంతార తెలుగు హక్కులను సొంతం చేసుకున్న అల్లు అరవింద్ ఈ సినిమాతో చేతినిండా లాభాలను గడిస్తున్నారు.
రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, హీరోగా నటించిన ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు.