కొంచెంసేపటి క్రితమే శాసనసభ సినిమా నుండి నన్ను పట్టుకుంటే అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. నన్ను పట్టుకుంటే జారిపోతుంటాను.. ఒంపుసొంపులున్న పాదరసమే నేను... అని సాగే ఈ పెప్పి పార్టీ సాంగ్ ను రవి బస్రుర్ స్వరపరచగా, సింగర్ మంగ్లీ పాడారు. హెబ్బా పటేల్ ఈ పాటకు డాన్స్ చేసారు.
నటకిరీటి రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాను వేణు డైరెక్ట్ చేస్తున్నారు. సాప్బ్రో ప్రొడక్షన్స్ బ్యానర్ పై షణ్ముగం సప్పని, తులసీరామ్ సప్పని నిర్మించారు. ఇంద్రసేనా, ఐశ్వర్యా రాజ్ హీరో హీరోయిన్లుగా నటించగా, సోనియా అగర్వాల్ ముఖ్యపాత్రలో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa