నటి హన్సిక తన స్నేహితుడు సొహైల్ ను ప్రేమ వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. వీరి వివాహం వచ్చే నెల 4న జైపూర్ లోని ముందోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్ లో జరగబోతోంది. సంగీత్, మెహందీ వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరి వివాహ వేడుక నెట్ ఫ్లిక్స్ లో లైవ్ స్ట్రీమింగ్ కానుందని, దీనికి సంబంధించి భారీ డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం.