టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య రీసెంట్ గా 'కృష్ణ బృందా విహారి' సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. తాజాగా ఇప్పుడు, ఈ హ్యాండ్సమ్ హీరో తన తదుపరి చిత్రాన్ని (NS 24) అధికారికంగా ప్రకటించారు. అన్ని ఎమోషనల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి SS అరుణాచలం రచన మరియు దర్శకత్వం వహించనున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, నాగ శౌర్య షూటింగ్ స్పాట్‌లో స్పృహతప్పి పడిపోయినట్లు సమాచారం. వెంటనే హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించగా డీహైడ్రేషన్‌కు గురయ్యాడని, ఇంకా ఏమీ లేదని వైద్యులు తెలిపారు. ఈ పాత్ర కోసం తన బెస్ట్ ఇవ్వడానికి గత 3 రోజులుగా డైట్‌లో ఉన్నట్లుగా అందుకే ఇలా జరిగింది అని వార్తలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa