2019 సంక్రాంతి… తెలుగు ప్రేక్షకులకు భారీ వినోదానికి వేదిక కానుంది. ఎందుకంటే… రోజుకో భారీ బడ్జెట్ మూవీ తెరపైకి రాబోతుంది మరి. జనవరి 9 నుంచి జనవరి 12 వరకు కొనసాగే ఈ సినిమాల `పండగ`లో… తొలిగా బరిలోకి దిగుతున్న చిత్రం `యన్.టి.ఆర్. కథానాయకుడు`. మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన తనయుడు నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో… ఈ ఏడాది సంక్రాంతి సినిమాల పర్వం ఘనంగా మొదలు కానుంది. ఆ తరువాతి రోజైన… జనవరి 10న సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన తమిళ అనువాద చిత్రం `పేట` సందడి చేయనుంది. సిమ్రన్, త్రిష హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు.
ఇక జనవరి 11న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన తాజా చిత్రం `వినయ విధేయ రామ` తెరపైకి రానుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. `రంగస్థలం` వంటి ఘనవిజయం తరువాత చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో… ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ పైన మంచి అంచనాలే ఉన్నాయి. ఇక చివరగా… జనవరి 12న అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ `ఎఫ్ 2` విడుదల కానుంది. విక్టరీ వెంకటేష్ తో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలసి నటించిన ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. మొత్తమ్మీద… నాలుగు వేర్వేరు జానర్స్‌లో తెరకెక్కిన ఈ బిగ్ టికెట్ ఫిల్మ్స్… రానున్న సంక్రాంతికి కాసుల వర్షం కురిపించి… రికార్డు స్థాయి విజయాలను అందుకోవాలని ఆకాంక్షిద్దాం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa