సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది `కాలా`, `2.ఓ` చిత్రాలతో అభిమానుల ముందుకొచ్చారు. `కాలా`నిరాశపరిస్తే… `2.ఓ` వసూళ్ళ వర్షం కురిపించింది. `2.ఓ` విడుదలైన ఒకటిన్నర నెలకే తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌తో థియేటర్లలో సందడి చేయనున్నారు రజనీ. ప్రస్తుతం ఆయన `పేట` సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. `పిజ్జా` ఫేమ్ కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రజనీ ఓ వైవిధ్యభరితమైన పాత్రలో కనిపించనున్నారని టాక్. ఆయనకి జోడీగా సిమ్రన్, త్రిష నటిస్తుండగా… కీలక పాత్రల్లో విజయ్ సేతుపతి, బాబీ సింహా, నవాజుద్దిన్ సిద్ధిఖీ, మేఘా ఆకాష్ కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతమందించిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే… ఇటీవలే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ కమిటీ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ జారీ చేసింది. అంతేకాదు… ఈ సినిమా నిడివి 172 నిమిషాలు (2 గంటల 52 నిమిషాలు) ఉంటుందని సమాచారం. మొత్తమ్మీద… డ్యూరేషన్ ఎక్కువ ఉన్న ఈ సూపర్ స్టార్ సినిమా ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa