వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా, నివేథా థామస్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా బ్రోచేవారెవరురా. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. టైటిల్ లుక్ పోస్టర్ చూస్తుంటే.. చాలా వినూత్నంగా ఉంది. ఓ డిఫరెంట్ కథనంతో సినిమా తెరకెక్కబోతున్నట్టే అర్ధమవుతోంది.
కాగా ఈ సినిమాలో ఇంకా నివేత పేతురాజ్ కూడా మరో కీలక పాత్రలో నటించనుంది. ఇంకా ఈ సినిమాలో ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ, సత్య దేవ్ నటిస్తున్నారు. మన్యం క్రీయేషన్స్ పతాకం ఫై మన్యం విజయ్ కుమార్ నిర్మిస్తున్న ఈచిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa