తెలుగు సినీ హీరో నాగశౌర్య అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం షూటింగ్‌లో ఉండగా అతడు సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో షూటింగ్ నిలిపి వేసి, అతడిని హుటాహుటిన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. డైటింగ్ చేస్తున్న ఆయన, సరైన ఫుడ్ తీసుకోక పోవడం వల్లే కళ్లు తిరిగి పడిపోయినట్లు తెలుస్తోంది.