సీజన్ వన్ తో ఆలిండియా నెంబర్ వన్ టాక్ షో గా IMDB లో చోటు సంపాదించిన "అన్ స్టాపబుల్ విత్ NBK' టాక్ షో సరికొత్తగా సెకండ్ సీజన్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే కదా. ఆరంభంలోనే ఈసారి సీజన్ మరింత రంజుగా ఉంటుందని ప్రకటించిన బాలయ్య అందుకు తగ్గట్టుగానే ఫస్ట్ ఎపిసోడ్ కి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారిని అతిధిగా ఆహ్వానించి, ఆడియన్స్ ని షాక్ కు గురి చేసారు.
తాజాగా మరొక పొలిటీషియన్ గతంలో సంయుక్తాంధ్రప్రదేశ్ కి చీఫ్ మినిస్టర్ గా అతికొద్దికాలం పనిచేసిన శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ టాక్ షోలో పాల్గొని బాలయ్యతో చిట్ ఛాట్ చెయ్యబోతున్నట్టు సమాచారం. మరి, ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.