కోలీవుడ్ బాక్సాఫీస్ ని కొల్లగొడుతున్న "లవ్ టుడే" త్వరలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుందన్న విషయం తెలిసిందే కదా. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గారు ఈ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ నెల్లోనే లవ్ టుడే తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుందని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 12:10 నిమిషాలకు లవ్ టుడే తెలుగు ట్రైలర్ విడుదల కాబోతుంది. ఈ మేరకు కొంతసేపటి క్రితమే అధికారిక ప్రకటన జరిగింది. పోతే, ఈ ట్రైలర్ ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చెయ్యనున్నారు.
ప్రశాంత్ రంగనాథన్ డైరెక్షన్లో యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో ఆయనే హీరోగా నటించారు. ఇవానా, రవీనా రవి హీరోయిన్లుగా నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.