సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురైన నేపథ్యంలో యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. అ!, కల్కి మరియు జోంబీ రెడ్డి సినిమాలతో ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమా 'హనుమాన్' టీజర్ లాంచ్ ఈవెంట్‌ను వాయిదా వేసుకున్నాడు. కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, గుండెపోటుతో సహా పలు అవయవాలు దెబ్బతినడంతో కృష్ణ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.