ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుణ్ తేజ్ పాన్ ఇండియా సినిమాలో మాజీ ప్రపంచసుందరి ..!

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 15, 2022, 06:20 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్13వ సినిమాకు సంబంధించిన అధికారిక ఎనౌన్స్మెంట్ రీసెంట్గానే జరిగింది. డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రెనసాన్స్ పిక్చర్స్, సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో 2017 ప్రపంచసుందరి మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించబోతుందని టాక్. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందట.


పోతే, ఈ సినిమాలో వరుణ్ పైలట్ గా నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందబడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa