కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "లాఠీ". వినోద్ కుమార్ డైరెక్షన్లో ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో విశాల్ పవర్ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నారు. రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ నందా నిర్మిస్తున్న ఈ సినిమాలో సునయన హీరోయిన్గా నటిస్తుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, లాఠీ మూవీ తమిళనాడు థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రెడ్ జైంట్ మూవీస్ కొనుగోలు చేసిందని, ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22వ తేదీన తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమా విడుదల కాబోతుందని టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa