గతేడాది టాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన సినిమాల్లో 'డీజే టిల్లు' ఒకటి. విమల్ కృష్ణ డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ నటించిన "డీజే టిల్లు" సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ క్రైమ్ కామెడీ చిత్రానికి సీక్వెల్‌ను మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'టిల్లు స్క్వేర్' అనే టైటిల్ ని లాక్ చేసారు.
ఇప్పుడు అందర్నీ షాక్‌కు గురిచేస్తున్న విషయం ఏమిటంటే మూవీ మేకర్స్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ని కూడా మార్చారు. శ్రీచరణ్ పాకాల స్థానంలో రామ్ మిర్యాల ఇప్పుడు సీక్వెల్‌కి పూర్తి స్థాయి సంగీత దర్శకుడుగా ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మార్చి 2023లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
సిద్ధూ సరసన ఈ సినిమాలో బ్యూటీ క్వీన్ అనుపమ పరమేశ్వరన్ జోడిగా కనిపించనుంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.