మెగాస్టార్ చిరంజీవి నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా "గాడ్ ఫాదర్". మోహన్ రాజా డైరెక్షన్లో మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యదేవ్, మురళీశర్మ, సునీల్, షఫీ, అనసూయ, పూరి జగన్నాధ్ కీలకపాత్రలు పోషించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో చిరుతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా అలరించిన గాడ్ ఫాదర్ మరి నాలుగు రోజుల్లోనే ఓటిటి ప్రేక్షకులను పలకరించనున్నారు. నవంబర్ 19న అంటే శనివారం నుండి నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో గాడ్ ఫాదర్ స్ట్రీమింగ్ కానుంది.