గాడ్ ఫాదర్ :
మోహన రాజా దర్శకత్వంలో టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి నటించిన "గాడ్ ఫాదర్" సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఇంటర్నేషనల్ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ నెల 19 నుండి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంటుందని ప్లాట్‌ఫారమ్ ప్రకటించింది. ఈ సినిమా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్, టోవినో థామస్, మంజు వారియర్ తదితరులు నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ లూసిఫర్‌కి రీమేక్. పొలిటికల్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార, పూరి జగన్నాధ్, సునీల్, సత్యదేవ్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. గాడ్ ఫాదర్ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.
సర్దార్ :
పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ నటించిన 'సర్దార్' సినిమా అక్టోబర్ 21న దీపావళికి గ్రాండ్‌గా విడుదల అయ్యింది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రాశి ఖన్నా, రజిషా విజయన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజా బజ్ ప్రకారం, ఈ చిత్రం ఆహాలో నవంబర్ 24, 2022న తమిళ్ అండ్ తెలుగు వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంటుంది అని సమాచారం.
ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో లైలా, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
అహ నా పెళ్లంట :
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ZEE5 ప్రకటించిన 'అహ నా పెళ్లంట' ప్రాజెక్ట్‌పై సంతకం చేసి OTT ప్లాట్ఫారంలోకి ఎంట్రీ సంగతి అందరికి తెలిసిన విషయమే. ZEE5 అండ్ తమడ మీడియాఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తుంది. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ వెబ్ సిరీస్ లో రాజ్ తరుణ్ శివాని అండ్ రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ సిరీస్ నవంబర్ 17, 2022న ప్రీమియర్‌గా ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది ఉన్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. 8 ఎపిసోడ్‌లు కలిగి ఉన్న ఈ వెబ్ సిరీస్ లో ఆమని, హర్షవర్ధన్, పోసాని కృష్ణ మురళి, గెటప్ శ్రీను, జబర్దష్ రాజమౌళి, తాగుబోతు రమేష్, మధునందన్, భద్రమ్ మరియు రఘు కరమంచి, దొరబాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. రాహుల్ తామాడ, సాయిదీప్‌రెడ్డి బుర్రా ఈ సిరీస్‌ని నిర్మిస్తున్నారు.