చైతుకి రీమేక్ సెంటిమెంట్ బాగానే కలిసి వస్తుంది. గతంలో హిట్లు గా నిలిచిన 'తడాఖా', 'ప్రేమమ్' లు రీమేక్ లు అన్న విషయం తెలిసిందే. 'బరైలీ కీ బర్ఫీ' చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావు, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను రీమేక్ చేసి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు నాగ చైతన్య.
చైతు ప్రస్తుతం సమంతతో కలిసి 'మజిలి' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ లో నటిస్తున్నాడట చైతూ. మరి వరుస ప్లాప్‌లలో ఉన్న చైతన్యకు ఈ రీమేక్ మూవీ అయిన హిట్ ఇస్తుందో లేదో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa