ఇప్పటి వరకు టెలివిజన్ హోస్ట్ గా, కమెడియన్ గా, మంచి ఎంటర్టైనర్ గా, హీరోగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు సుడిగాలి సుధీర్. కానీ "గాలోడు" చిత్రం ద్వారా సుధీర్ మాస్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకోనున్నారు.
సుడిగాలి సుధీర్ నటించిన కొత్త చిత్రం "గాలోడు". ఇప్పటివరకు కామెడీ నేపధ్య సినిమాలను చేసిన సుధీర్ ఫస్ట్ టైం మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాను చేసారు. ఈ చిత్రం రేపే థియేటర్లకు రాబోతుంది. మరి, సుధీర్ కు మాస్ హీరో ఇమేజ్ ను ప్రేక్షకులు ఇస్తారో లేదో చూడాలి.
రాజశేఖర్ పులిచర్ల డైరెక్ట్ చేసి, నిర్మించిన ఈ చిత్రంలో సుధీర్ కు జోడిగా గెహన సిప్పి నటించింది. భీమ్స్ సంగీతం అందించారు.
![]() |
![]() |